ప్రతి ఇంటి తలుపు తడుతున్న ముఖ్యమంత్రి
బీహారులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతి ఇంటి తలుపు తట్టండి- అనే నినాదంతో ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు.దీని ప్రకారం బీహారులోని కోటి ఇళ్ల తలుపులను తడతారు.ఆ సందర్భంగా బీహారులో జెడి యు ప్రభుత్వం చేపట్టిన వివిద కార్యక్రమాలు ప్రజలకు తెలియచేస్తారు.ప్రధాని మోడీ ఎన్నికల ముందు ప్రచార వ్యూహ రచన చేసిన ప్రశాంత కిషోర్ అనే నిపుణుడు ఈ ప్లాన్ తయారు చేశారు.దీని ప్రకారం స్వయంగా ముఖ్యమంత్రి నితీష్ కూడా పాట్నాలో ఒక కొన్ని ఇళ్లకు స్వయంగా వెళ్లారు.ప్రతి కార్యకర్త రోజుకు పది ఇళ్లు సందర్శించాలని ,ఆ సందర్భంగా నితీష్ స్టిక్కర్ అంటించాలని సూచించారు.దీనితో పాటు మళ్లీ మంచి రోజులు వచ్చాయి అని, బీహారు ముందుకు వెళుతోంది అనే నినాదాలు ,రింగ్ టోన్ లు మొదలైనవి తయారు చేశారు.అయితే ఇదంతా మా మోడీని కాపీ కొట్టినవే అని బిజెపి వ్యాఖ్యానిస్తోంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








